Vijayawada: చిన్నారి నాగవైష్ణవి కేసులో తీర్పు.. దోషులకి జీవిత ఖైదు

  • తీర్పు వెల్లడించిన విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు 
  • కేసులో ఏ-1 శ్రీనివాసరావు, ఏ-2 జగదీశ్‌, ఏ-3 వెంకటరావు 
  • 2010లో చిన్నారి నాగవైష్ణవి హత్య
విజయవాడలో 2010లో జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు దోషులకు ఆ నగర మహిళా సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎం.శ్రీనివాసరావు ఏ-1గా, జగదీశ్‌ ఏ-2గా, వెంకటరావు ఏ-3గా ఉన్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

కాగా, మద్యం వ్యాపారం చేసుకునే ప్రభాకర్ అనే వ్యక్తి నర్మద అనే యువతిని రెండో వివాహం చేసుకోగా, వారికి సాయితేజేష్, నాగవైష్ణవి ఇద్దరు సంతానం కలిగారు. వైష్ణవి పేరుపై తండ్రి ఆస్తులు కూడగడుతున్నాడని తెలుసుకున్న .. ప్రభాకర్ మొదటి భార్య వెంకటరామమ్మ సోదరుడు వెంకటరావు (ఏ-3).. ఆ చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుని శ్రీనివాసరావు, జగదీశ్‌లతో కలిసి పథకం పన్ని ఆ చిన్నారిని దారుణంగా హతమార్చారు.
Vijayawada
naga vaishnavi
verdict

More Telugu News