mns: రాజ్ ఠాక్రే జన్మదినం సందర్భంగా.. లీటరు పెట్రోలుపై రూ.4 తగ్గింపు!

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లో ఓ కొత్త ట్రెండ్ ను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చూపిస్తోంది. ఈ రోజు పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని 48 పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ను రూ.4 చొప్పున తగ్గించి మరీ అమ్మకాలు జరిపిస్తోంది. ధరలు భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఎంఎన్ఎస్ పార్టీ నిర్ణయంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో 36 పెట్రోల్ స్టేషన్లలో, ఇతర ప్రాంతాల్లో  12 చోట్ల ఈ అవకాశం కల్పించింది.

అయితే, ఈ తగ్గింపు కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం. ఇలా తగ్గించి పెట్రోల్ అమ్మకాలు జరపడం వల్ల ఈ రోజు ఎంత మేర లోటు ఉంటుందో ఆ మొత్తాన్ని ఎంఎన్ఎస్ పెట్రోల్ బంక్ లకు చెల్లిస్తుంది. అయితే, కొన్ని చోట్ల లీటర్ పై రూ.9 వరకు తగ్గించి పెట్రోల్ అమ్ముతున్నట్టు సమాచారం. రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు తమ పార్టీ అధ్యక్షుడి పుట్టిన రోజున పేదవారికి ఏవైనా ఉచితంగా అందించే కార్యక్రమాలు చేయడం చూశాం. కానీ, ఎంఎన్ఎస్ మాత్రం కొత్త విధానాన్ని పరిచయం చేసింది.
Go Back to Shorts
mns
maharastra
petrol prices
discount

More Telugu News