varla ramaiah: ఇప్పుడు, బొత్సకు జగన్ దేవుడిలా కనిపిస్తున్నారా?: వర్ల రామయ్య

  • అప్పుడు జగన్ ని అవినీతిపరుడని బొత్స విమర్శించారు
  • రోజుకో మాట మార్చే బొత్సకు బాబును విమర్శించే అర్హత లేదు
  • అమిత్ షా కనుసన్నల్లోనే వైసీపీ నడుస్తోంది
అప్పుడు జగన్ ని అవినీతిపరుడని విమర్శించిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఆయనే దేవుడిలా కనిపిస్తున్నారా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజుకో మాట మార్చే బొత్సకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని అన్నారు. బొత్స అవినీతి వల్లే ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఉత్తరాంధ్రకు రాకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కనుసన్నల్లోనే వైసీపీ నడుస్తోందని వర్ల రామయ్య విమర్శించారు.
varla ramaiah

More Telugu News