machilipatnam: మచిలీపట్నం వద్ద అల్లకల్లోలంగా మారిన సముద్రం

  • ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
  • ఎగసి పడుతున్న అలలు
  • కోతకు గురైన బీచ్ రోడ్డు
కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. మంగినపూడి బీచ్ వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. పెద్ద ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అలల బీభత్సంతో బీచ్ ముఖద్వారం వద్ద ఉన్న టెలిఫోన్ స్తంభం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. బీచ్ రోడ్డు కోతకు గురైంది.

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా, ఒడ్డునే తమ బోట్లను నిలిపివేశారు. వాతావరణశాఖ హెచ్చరికలతో బీచ్ లోకి పర్యాటకులను అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ... ఔట్ పోస్ట్ పోలీసులు బేఖాతరు చేశారు. ఔట్ పోస్టుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో, ఈ పరిస్థితుల్లో కూడా బీచ్ లోకి పర్యాటకులు వెళ్తున్నారు.
machilipatnam
beach
waves
bay of bengal

More Telugu News