West Godavari District: జగన్‌ సభ నిర్వహించిన ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసిన టీడీపీ!

షార్ట్స్‌లో చూడండి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద నిన్న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఈరోజు టీడీపీ నాయకులు శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మహిళా నేతలు పసుపు నీళ్లు చల్లి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి వారంతా అక్కడి ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని టీడీపీ అభివృద్ధి చేస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు.                                
Go Back to Shorts
West Godavari District

More Telugu News