CM Ramesh: కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా!: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌

  • కడప ఉక్కు కర్మాగారం కోసం పోరాడతా
  • ఈనెల 17,18 తేదీల్లో మోదీ అపాయింట్‌ మెంట్‌ కోరాను
  • సమయమిస్తే ప్రతినిధి బృందంతో ప్రధానితో చర్చిస్తా
కేంద్ర ఉక్కు గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో టాస్క్‌ఫోర్స్‌ భేటీ జరిగింది. కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఇందులో చర్చించకపోవడంతో సమావేశాల పేరిట కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేశ్‌ మాట్లాడుతూ... తాను ఈనెల 17, 18 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌ మెంట్‌ కోరానని, ఆయన సమయమిస్తే తమ ప్రతినిధి బృందంతో కలిసి కడప ఉక్కు కర్మాగారంపై విజ్ఞప్తి చేస్తామని, లేదంటే ఇక పోరాటం మొదలుపెట్టి, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.
    
CM Ramesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News