india railway: రైల్వే ఆదాయాన్ని రెండింతలు చేయడమే మా టార్గెట్: పీయూష్ గోయల్

  • 2025 నాటికి రూ.4 లక్షల కోట్ల ఆదాయం
  • ఈ మధ్య కాలంలో రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు
  • రైల్వే మార్గాల విద్యుద్దీకరణ, ఇతర అభివృద్ధి పనులు

భారతీయ రైల్వేల ఆదాయాన్ని 2025 నాటికి రెట్టింపు (రూ.4 లక్షల కోట్లు) చేయాలన్నదే తమ లక్ష్యమని ఆ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మధ్య కాలంలో రూ.9 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెడతామని చెప్పారు. ‘‘మా లక్ష్యం రైల్వేలను లాభాల్లోకి తీసుకురావడమే. దీంతో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడే అవసరం ఉండదు’’ అని గోయల్ చెప్పారు.

సిగ్నలింగ్ ను మెరుగుపరచడం, ఎలక్ట్రిక్ మార్గాలను విస్తరించడం, ఆస్తుల వినియోగాన్ని పెంచడం వంటి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. వ్యయాలను తగ్గించడం చాలా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. అన్ని మార్గాలను విద్యుద్దీకరించడం ద్వారా తాము ఏటా రూ.15,000 కోట్లు ఆదా చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. రానున్న ఐదేళ్లలో చాలా వరకు మార్గాలను విద్యుద్దీకరించే ప్రణాళికను సిద్ధం చేసినట్టు చెప్పారు. 2019 మార్చి నాటికి 68 స్టేషన్ల అభివృద్ధి పూర్తవుతుందని తెలిపారు. ప్రైవేటు రంగం పెట్టుబడులను ఆకర్షించేందుకు షరతులను సరళీకరించనున్నట్టు సంకేతం ఇచ్చారు.

More Telugu News