vijay sethupati: భారీ యాక్షన్ కామెడీ మూవీగా 'జుంగా' .. ట్రైలర్ రిలీజ్

  • విజయ్ సేతుపతి హీరోగా 'జుంగా'
  • కథానాయికగా సాయేషా సైగల్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు    
తమిళంలో కమల్ .. విక్రమ్ .. సూర్య తరువాత విభిన్నమైన కథలకు .. పాత్రలకి ప్రాధాన్యతనిచ్చే కథానాయకుడిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'జుంగా' రూపొందింది. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా సాయేషా సైగల్ నటించింది. కామెడీ కలగలిసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ ను బట్టి ఇది యాక్షన్ కామెడీ మూవీ అనే విషయం స్పష్టమవుతోంది. డిఫరెంట్ లుక్ తో విజయ్ సేతుపతి కొత్తగా కనిపిస్తూ ఉండగా, సాయేషా సైగల్ మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. మడోన్నా సెబాస్టియన్ కూడా అక్కడక్కడా మెరిసింది. విదేశీ లొకేషన్లు .. అక్కడి భారీ ఛేజింగ్స్ ఈ ట్రైలర్ కి హైలైట్స్ గా నిలుస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హిట్ పడితే తమిళంలో సాయేషా దూకుడును ఆపడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.
vijay sethupati
sayesha saigal
madonna

More Telugu News