Narendra Modi: నరేంద్ర మోదీ చాలెంజ్ పై వెంటనే స్పందించిన కుమారస్వామి!

  • ఫిట్ నెస్ వీడియోను పోస్టు చేస్తూ కుమారస్వామిని చాలెంజ్ చేసిన మోదీ
  • ఫిట్ నెస్ చాలెంజ్ కి మద్దతిస్తున్నానన్న కుమారస్వామి
  • ప్రజల్లో ఫిట్ నెస్ పెంచేందుకు కేంద్రం సహకరించాలని వినతి
ప్రధాని నరేంద్ర మోదీ, తనను టార్గెట్ చేస్తూ ఫిట్ నెస్ చాలెంజ్ చేయడంపై కర్ణాటక సీఎం కుమారస్వామి వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ప్రియమైన నరేంద్రమోదీజీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అని వ్యాఖ్యానించారు. కాగా, తన ఫిట్ నెస్ వీడియోను పోస్టు చేసిన నరేంద్ర మోదీ, దాన్ని కుమారస్వామికి ఈ ఉదయం ఫార్వార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Kumaraswamy
Fitness Challenge
Twitter

More Telugu News