Nalgonda District: కార్మికుల సమ్మె.. తెలంగాణలో 800 గ్రామాలకు నిలిచిన కృష్ణా జలాల సరఫరా!

  • సమ్మె ప్రారంభించిన నల్గొండ ఆర్ డబ్ల్యూఎస్ కార్మికులు
  • మూకుమ్మడి సమ్మెతో నిలిచిన ట్యాంకర్లు
  • సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న అధికారులు
తమ న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ, నల్గొండ ఆర్ డబ్ల్యూఎస్ అండ్ ఎస్ (రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్) కార్మికులు మూకుమ్మడి సమ్మెకు దిగడంతో సుమారు 800 గ్రామాలకు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ ఉదయం నుంచి ఆర్ డబ్ల్యూఎస్ కేంద్రం నుంచి వాటర్ ట్యాంకర్లు కదల్లేదు.

దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు చెప్పా పెట్టకుండా సమ్మెకు దిగారని అధికారులు చెబుతుండగా, సమ్మెకు తాము ముందుగానే నోటీసులు ఇచ్చామని, అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు కార్మికులతో చర్చలు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
Nalgonda District
RWS&S
Protest
Water Supply

More Telugu News