dronavalli Harika: పెళ్లి పీటలెక్కనున్న ద్రోణవల్లి హారిక.. 18న హైదరాబాద్‌లో నిశ్చితార్థం

  • సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రతో వివాహం
  • ఈ నెల 18న నిశ్చితార్థం
  • ఆగస్టు 19న వివాహం
ప్రముఖ చెస్ క్రీడాకారిణి, ఏపీ గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. సివిల్ ఇంజినీర్ కార్తీక్ చంద్రను ఆగస్టు 19న వివాహమాడనుంది. ఈ నెల 18 న హైదరాబాద్‌లో హారిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

అతి చిన్న వయసులోనే స్టార్ క్రీడాకారిణిగా ఎదిగిన హారిక 2008 లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్ మాస్టర్ హోదాను సొంతం చేసుకుంది. 2012, 2015, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు సాధించింది. ప్రపంచ నంబర్ వన్‌గా ఎదగాలన్నదే తన లక్ష్యమని హారిక పలుమార్లు పేర్కొంది.
dronavalli Harika
Chess
karthik chandra
Hyderabad

More Telugu News