Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన కేటీఆర్‌

షార్ట్స్‌లో చూడండి
కొమరంభీం అసిఫాబాద్‌ జిల్లాలో ఓ వృద్ధ జంట గుడిసెలో నివసిస్తున్నారని, వారికి కూడా రూ.500 ఇంటి పన్ను వేశారని తెలుపుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణ సీఎంవోతో పాటు మంత్రి కేటీఆర్‌కి ట్వీట్‌ చేశారు. వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాలని, అలాగే వెంటనే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌... వారి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్‌ చేశారు. స్థానిక పంచాయతీ సెక్రెటరీకి ఈ విషయం తెలిపి, తప్పును సరిదిద్దుకునేలా చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌కి కేటీఆర్ సూచించారు. అలాగే, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇవ్వాలని, వారికి ఆసరా పెన్షన్‌ అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే వచ్చేలా చేయాలని ఆదేశించారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
KTR
TRS

More Telugu News