narendra modi: ప్రధాని మోదీతో భేటీ అయిన కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సమావేశం
  • రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చ
  • కన్నాతో పాటు భేటీకి హాజరైన కొందరు నేతలు
ప్రధాని మోదీతో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం, బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి, ఇతర పార్టీల కార్యాచరణ తదితర అంశాలపై వీరు చర్చలు జరుపుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీని కన్నా కలవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో, ఈ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి కన్నాతో పాటు మరికొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. 
narendra modi
kanna lakshminarayana
meeting

More Telugu News