Kerala: విజయవాడలో ఊమెన్‌ చాందీని కలసి సమస్యలు చెప్పుకున్న మలయాళీలు

  • ఏపీలో విద్యా విధానం బాగోలేదన్న మలయాళీలు
  • కేరళలో మాదిరిగా ఇక్కడ ప్రభుత్వ విద్యా విధానం కావాలి
  • ఆ విధంగా అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి
విజయవాడ నుంచి కేరళకు రైలు ఏర్పాటుకు కృషి చేయాలని ఏపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఊమెన్‌ చాందీని మలయాళీల బృందం కోరింది. వారంతా గతంలో కేరళ నుంచి విజయవాడకు వచ్చి స్థిరపడ్డారు. ఊమెన్‌ చాందీ విజయవాడకు వచ్చిన నేపథ్యంలో కేరళ క్లబ్‌ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మలయాళీలు ఆయనను కలిసి తమ సమస్యలను చెప్పారు.

 అనంతరం ఊమెన్‌ చాందీ ఏపీసీసీ నేతలతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 13న ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో కూడా ఊమెన్‌ చాందీ సమావేశం కానున్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ఎటువంటి వ్యూహం అమలు చేయాలనే విషయంపై చర్చించనున్నారు.     
Kerala
Vijayawada
Congress

More Telugu News