Twitter: చార్మినార్‌ వద్ద గాజులు కొనుక్కున్న బాలీవుడ్‌ హీరోయిన్.. ఎవ్వరూ గుర్తుపట్టని వైనం

షార్ట్స్‌లో చూడండి
తన తల్లి అమృత సింగ్‌తో కలసి బాలీవుడ్‌ నటి సారా అలీ ఖాన్‌ హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద షాపింగ్‌ చేశారు. అయితే, వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేకపోవడం విశేషం. ఆమె బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె దర్శకుడు రోహిత్‌ శెట్టి, బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'సింబా' సినిమాలో నటిస్తున్నారు.

తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' సినిమాకి ఇది రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. సాధారణ మహిళలా సారా తన తల్లితో కలిసి గాజులు కొంటుండగా ఒకరిద్దరు మాత్రమే ఆమెను గుర్తించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముంబయిలో బాగా పాప్యులారిటీ ఉన్న సారా అలీ ఖాన్‌ గురించి హైదరాబాద్‌లో అంతగా తెలియదు. దీంతో వారిని అక్కడి వారు గుర్తించలేకపోయారు.         
Go Back to Shorts
Twitter
Bollywood
Hyderabad

More Telugu News