pragathi: ఇరవైయ్యేళ్లకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను: నటి ప్రగతి

  • 17 యేళ్లకే హీరోయిన్ ను అయ్యాను 
  • 19 వచ్చేనాటికి 7 సినిమాలు చేశాను 
  • ఇకపై నటించవద్దని అనుకున్నాను
విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. సహజమైన నటనతో ప్రగతి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. "భాగ్యరాజా సినిమా ద్వారా నేను తమిళ చిత్రపరిశ్రమకి కథానాయికగా పరిచయమయ్యాను .. అప్పుడు నా వయసు 17 యేళ్లే. అలా నేను వరుసగా రెండేళ్లలోపే హీరోయిన్ గా ఏడు సినిమాలు చేశాను.

20 యేళ్లు రాగానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను .. 21 యేళ్లకే తల్లినయ్యాను. అప్పట్లో సినిమా అనేది నా మైండ్ సెట్ కి సెట్ అయ్యే ఫీల్డ్ లా అనిపించలేదు. అందువల్లనే ఇక సినిమాలు వద్దు అనుకున్న తరువాతనే నేను పెళ్లి చేసుకున్నాను. ఆ తరువాత మూడేళ్లకే మళ్లీ నటన పట్ల ఆసక్తిని చూపించాను. అప్పుడు సినిమా అవకాశాలు కావాలంటే రావు కనుక .. టీవీ సీరియల్స్ నుంచి మొదలుపెట్టాను. అప్పటి నుంచే కెరియర్ ను సీరియస్ గా తీసుకోవడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.     
pragathi
ali

More Telugu News