Chandrababu: వాజపేయి ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు

  • ఢిల్లీలోని ఉన్నతాధికారులతో మాట్లాడిన చంద్రబాబు
  • వాజపేయి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం
  • ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపిన ఎయిమ్స్ వైద్యులు
అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఢిల్లీలోని ఉన్నతాధికారులతో తాను మాట్లాడానని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. వాజపేయి తొందరగా కోలుకోవాలని, కుటుంబసభ్యులతో కలసి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. సోమవారం ఉదయం వాజపేయిని హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. మూత్రపిండాల సమస్య, శ్వాసకోశ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. రెండు ఊపిరితిత్తుల్లో ఒకటి పని చేయడం లేదు. మరోవైపు, వాజపేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
Chandrababu
vajpayee
health
aiims

More Telugu News