Narendra Modi: ఎయిమ్స్‌ కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ

  • వాజ్‌పేయి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడనున్న మోదీ
  • రణదీప్‌ గులేరియా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు
  • వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఇప్పటికే వైద్యుల ప్రకటన
భారత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయిని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన వాజ్‌పేయిని చూసి వైద్యులతో మాట్లాడనున్నారు. కాగా, వాజ్‌పేయి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరారని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా ఎయిమ్స్‌ వద్దే ఉన్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులతో మాట్లాడుతున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఇప్పటికే వైద్యులు ప్రకటించారు.  
Narendra Modi
vajpeyee

More Telugu News