Nani: తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై హీరో నాని భావోద్వేగపూరిత ట్వీట్‌!

  • చట్టపరంగా ముందుకు వెళుతున్నాను
  • పరువు నష్టం కేసు వేస్తూ లీగల్‌ నోటీసులు ఇచ్చాను.
  • సున్నితంగా కనపడే వారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
తన పరువుకి భంగం కలిగిస్తూ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి నాని స్పందించాడు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని పేర్కొంటూ ట్వీట్‌ చేశాడు.      

    "చట్టపరంగా ముందుకు వెళుతున్నాను. పరువు నష్టం కేసు వేస్తూ లీగల్‌ నోటీసులు ఇచ్చాను. సున్నితంగా కనపడే వారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నాపై చేస్తున్న నిరాధార ఆరోపణలు నన్ను కలచివేశాయి. నేను నా గురించి బాధపడడం లేదు. మనం ఉన్న సమాజం గురించి బాధపడుతున్నాను. నాపై చేస్తోన్న నిరాధార ఆరోపణలను క్లిక్‌ల కోసం కొందరు ప్రచురిస్తున్నారు. వారికి కూడా కుటుంబాలుంటాయి కదా.."  అని నాని పేర్కొన్నారు.
 
Nani
srireddy
notices

More Telugu News