Andhra Pradesh: పోలవరానికి సంబంధించి కేంద్రం పైసా కూడా బాకీ లేదు: కన్నా

  • పోలవరానికి కేంద్రం ఇటీవలే రూ.1400 కోట్లు విడుదల చేసింది
  • అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారు
  • ప్రతిపక్షం అంటే విలువ లేనట్టుగా టీడీపీ ప్రవర్తిస్తోంది
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్రం పైసా కూడా బాకీ లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు ఇటీవలే రూ.1400 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. టీడీపీ సంస్కార హీనుల పార్టీ అని, రాష్ట్రాన్ని దోచుకున్న ఆ పార్టీ నేతలకు కళ్లు కనబడటం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్ని కులాలకు మేలు చేస్తానని నాడు హామీలిచ్చిన చంద్రబాబు వారిని మోసం చేశారని విమర్శించారు. ఈరోజు తాము ధర్నా చేస్తే దానికి పోటీగా టీడీపీ నాయకులు కూడా ధర్నా చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ అంటే విలువ లేనట్టుగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ పార్టీలో చేరికల గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని, కొత్త వాళ్లకు స్థానం కల్పిస్తామని చెప్పారు.
Andhra Pradesh
kanna
polavaram

More Telugu News