Arvind Kejriwal: ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటిస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తాం: కేజ్రీవాల్

  • 2019 లోపు ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలి
  • ఒకవేళ మా డిమాండును పట్టించుకోకపోతే ఊరుకోం
  • ఢిల్లీని బీజేపీ వీడాలని ప్రజలు డిమాండ్ చేస్తారు
ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు శాసనసభలో ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ... ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని, అన్ని ఓట్లు ఆ పార్టీకే వేయాలని చెబుతామని అన్నారు. 2019 లోపు ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అన్నారు. ఒకవేళ తమ డిమాండును పట్టించుకోకపోతే ఢిల్లీని బీజేపీ వీడాలని ప్రజలు డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు. 
Arvind Kejriwal
New Delhi
BJP
AAP

More Telugu News