Anushka Shetty: ఏడాది చివరిలోగా అనుష్క పెళ్లి.. జాతీయ మీడియా కథనం

  • పెళ్లి కొడుకుల ప్రొఫైల్స్ చూస్తున్న అనుష్క తల్లిదండ్రులు
  • సరైన వ్యక్తి దొరికితే.. పెళ్లి పనులు ప్రారంభం
  • ఆలయాలు సందర్శిస్తూ, పూజలు చేస్తున్న అనుష్క
అందాల తార అనుష్క షెట్టి త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఓ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివర్లో అనుష్క పెళ్లి జరిగే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొంది. పెళ్లికి ముందు అనుష్క పలు ఆలయాలను సందర్శిస్తూ పూజలు చేస్తోందని తెలిపింది.

ఆమె తల్లి దండ్రులు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని వెల్లడించింది. పెళ్లి కొడుకు కోసం అనుష్క తల్లిదండ్రులు చాలా మంది ప్రొఫైల్స్ చూస్తున్నారట. అనుష్కకు సరైన జోడీ దొరికితే, వెంటనే పెళ్లి పనులు ప్రారంభమవుతాయని తెలిపింది. మరోవైపు హీరో ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లే అంటూ ఇద్దరూ కొట్టిపడేశారు.
Anushka Shetty
marriage

More Telugu News