awajuddin: శివుడిపై అభ్యంతరకర ఫొటో పోస్ట్.. బాలీవుడ్ నటుడి సోదరుడిపై కేసు

  • ఫేస్ బుక్ లో ఫొటో షేర్
  • ఫొటో తాను పోస్ట్ చేయలేదన్న అయాజుద్దీన్
  • కామెంట్ మాత్రమే పెట్టానంటూ వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సోదరుడు అయాజుద్దీన్ సిద్దిఖీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే శివుడికి సంబంధించిన ఓ అభ్యంతరకరమైన ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారంటూ అభియోగాలు నమోదు చేశారు.

 దీనిపై అయాజుద్దీన్ స్పందిస్తూ, ఆ ఫొటోను తాను పోస్ట్ చేయలేదని, ఇలాంటి ఫొటోల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయనే కామెంట్ ను మాత్రమే పెట్టానని తెలిపారు. అసలు నిందితులను పట్టుకోవడం మానేసి, తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపట్ల పూర్తి విచారణ చేయించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 
awajuddin
ayazuddin
bollywood
facebook

More Telugu News