budha venkanna: అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్లారు!: కన్నాపై బుద్దా వెంకన్న విసుర్లు

  • కన్నా లక్ష్మీనారాయణపై వెంకన్న విమర్శలు
  • కన్నాపై ఎక్కడ నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధం
  • ఆయనకు డిపాజిట్ వస్తే గుండు కొట్టించుకుంటా
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. కేవలం అక్రమాస్తులను కాపాడుకోవడానికే ఆయన బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కన్నాపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని... కన్నాకు డిపాజిట్ వస్తే తాను గుండు కొట్టించుకుంటానని అన్నారు.

విజయవాడలో బీజేపీ నేతలు చేపట్టిన ధర్నా అధర్మమైనదని చెప్పారు. బీజేపీ ధర్నాకు వ్యతిరేకంగా తాము నిరసన తెలిపామని అన్నారు. ప్రధాని మోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, బీజేపీ విజయవాడలో ఆందోళన చేసింది. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 
budha venkanna
kanna lakshminarayana

More Telugu News