అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్లారు!: కన్నాపై బుద్దా వెంకన్న విసుర్లు
- కన్నా లక్ష్మీనారాయణపై వెంకన్న విమర్శలు
- కన్నాపై ఎక్కడ నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధం
- ఆయనకు డిపాజిట్ వస్తే గుండు కొట్టించుకుంటా
విజయవాడలో బీజేపీ నేతలు చేపట్టిన ధర్నా అధర్మమైనదని చెప్పారు. బీజేపీ ధర్నాకు వ్యతిరేకంగా తాము నిరసన తెలిపామని అన్నారు. ప్రధాని మోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, బీజేపీ విజయవాడలో ఆందోళన చేసింది. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.