keerthana: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్

  • హైదరాబాద్ శివారు మియాపూర్ లో ఘటన
  • తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్న కీర్తన
  • ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు
హైదరాబాద్ శివారు మియాపూర్ లో కీర్తన అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఆల్విన్ కాలనీలోని నివాసంలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. తొమ్మిదేళ్ల క్రితం శ్రీధర్ తో కీర్తనకు పెళ్లి అయింది. శ్రీధర్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం మానేసి, ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కీర్తన ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఇతర కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 
keerthana
software
engineer
hang

More Telugu News