artist ravi kishan: సినీ రంగంలో మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదు: 'రేసుగుర్రం’ నటుడు రవికిషన్

  • ఇది మహిళలకే పరిమితం కాలేదంటున్న నటుడు! 
  • మగనటులను లైంగికంగా వేధించే హీరోయిన్లు బాగానే ఉన్నారు
  • ‘రేసుగుర్రం’ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రవికిషన్

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి గళం విప్పినప్పటి నుంచి ఈ అంశం గురించిన ప్రస్తావన కొనసాగుతూనే ఉంది. మహిళా నటులు పలువురు తమకు జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేశారు. అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులకే కాదు మగవారికీ క్యాస్టింగ్ కౌచ్ తప్పట్లేదంటూ ‘రేసు గుర్రం’ సినిమా ద్వారా  టాలీవుడ్ కు  పరిచయమైన నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో మగనటులను లైంగికంగా వేధించే హీరోయిన్ల సంఖ్య ఎక్కువగానే ఉందని అన్నారు. అయితే, తనకు ఇలాంటి వేధింపులేమైనా ఎదురయ్యాయా అనే విషయాన్ని రవికిషన్ ప్రస్తావించలేదు. కాగా, తెలుగు, హిందీ, భోజ్ పురి భాషా చిత్రాల్లో నటించిన రవికిషన్, ‘కిక్ 2’, సుప్రీం, ’ఒక్క అమ్మాయి తప్ప’, ‘రాధ’, ‘లై’, ‘సాక్ష్యం’ సినిమాల్లో నటించాడు.

  • Loading...

More Telugu News