vishal: వరలక్ష్మితో ఎఫైర్ గురించి స్పందించిన విశాల్!

  • వరలక్ష్మి నాకు మంచి స్నేహితురాలు 
  • కష్ట సుఖాలు మాట్లాడుకుంటాం 
  • మా మధ్య మరో సంబంధమేదీ లేదు  
తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి .. విశాల్ మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. ఈ కారణంగానే శరత్ కుమార్ కి .. విశాల్ కి మధ్య శత్రుత్వం ఏర్పడిందనే టాక్ వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలకి సంబంధించిన ప్రశ్నలు విశాల్ కి ఎదురయ్యాయి.అందుకు విశాల్ తనదైన శైలిలో స్పందించారు. వరలక్ష్మి తనకి మంచి స్నేహితురాలని ఆయన చెప్పారు. కష్ట సుఖాలను గురించి ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటూ ఉంటామని అన్నారు. 'మా ఇద్దరి మధ్య ఏదో సంబంధమున్నట్టుగా షికారు చేస్తోన్న వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చారు. ఇక తమిళ రాజకీయాలకి సంబంధించిన విషయంపై మాట్లాడుతూ, రజనీ .. కమల్ విధివిధానాలపై ఒక స్పష్టత వచ్చాక ఎవరివెంట నడవాలనేది ఆలోచిస్తానని అన్నారు.   
vishal
varalakshmi

More Telugu News