Jagan: జగన్ ప్రజాసంకల్ప యాత్రలో బాలకృష్ణ ఫ్లెక్సీ!

  • బాలయ్యపై వైసీపీ కార్యకర్త అభిమానం
  • పశ్చిమగోదావరి జిల్లా మల్లవరంలో ఫ్లెక్సీ ఏర్పాటు
  • ఫ్లెక్సీలో రాజశేఖర్ రెడ్డికి ఒక వైపు జగన్.. మరోవైపు బాలకృష్ణ 
పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ యాత్రలో ప్రముఖనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒక వైపు జగన్.. మరోవైపు బాలకృష్ణ ఉన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు, ప్రజలు ఈ ఫ్లెక్సీని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయమై మీడియా ఆరా తీయగా ఆసక్తికర విషయం తెలిసింది. పశ్చిమగోదావరి జిల్లా మల్లవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఒకరు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, నందమూరి బాలకృష్ణకు అతను అభిమాని అని స్థానికులు తెలిపారు.

కాగా, కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం గౌరిప‌ల్లి నుంచి 186వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ ఈరోజు ప్రారంభమైంది. నంద‌మూరు క్రాస్ ద‌గ్గ‌ర 2300 కిలోమీట‌ర్ల మార్క్ ను జ‌గ‌న్ పాద‌యాత్ర‌ చేరుకుంది.  
Jagan
Balakrishna

More Telugu News