lb sri ram: ఆలోచింపజేసే లఘు చిత్రాలు .. దర్శక నిర్మాతగా ఎల్బీ శ్రీరామ్ ప్రయోగాలు

  • మనసును కదిలించే రచయిత 
  • గిలిగింతలు పెట్టే హాస్యనటుడు 
  • దర్శక నిర్మాతగా ప్రయోగాలు  
రచయితగా శభాశ్ అనిపించుకుని .. ఆ తరువాత నటుడిగాను రాణించిన అతికొద్ది మందిలో ఎల్బీ శ్రీరామ్ ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆయనకి నవ్వించడము తెలుసు .. బరువైన హావభావాలతో ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించడమూ తెలుసు . అలాంటి ఎల్బీ శ్రీరామ్ ఇటీవల కాలంలో షార్ట్ ఫిలిమ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టారు. బంధాలు .. అనుబంధాలు .. సామాజిక బాధ్యతలను ప్రధానంగా చేసుకుని ఆయన కథలను అల్లుకుంటున్నారు.

మనసు పెట్టి తాను రాసుకున్న కథలకు దర్శక నిర్మాతగా న్యాయం చేస్తూ వస్తున్నారు. అలా తాజాగా ఆయన తన తదుపరి షార్టు ఫిల్మ్ ను నిన్న వరంగల్ లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ .. యువతలో చైతన్యాన్ని పెంపొందించేలా .. సామాజిక స్ఫూర్తిని కలిగించేలా లఘు చిత్రాల రూపకల్పన జరుగుతున్నట్టుగా చెప్పారు. ఈ లఘు చిత్రం షూటింగు చూడటానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున రావడం విశేషం.   
lb sri ram

More Telugu News