Uttar Pradesh: శివాలయంలో సన్యాసిని ఇఫ్తార్ విందు.. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు

  • ప్రాచీన మన్‌కామేశ్వర్ ఆలయంలో విందు
  • ఏర్పాట్లు చేసిన ఆలయ సిబ్బంది
  • గోమతీ నది ఒడ్డున కార్యక్రమం
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లో ఓ సన్యాసిని శివాలయంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. లక్నోలోని ప్రాచీన శివాలయాల్లో ఒకటైన మన్‌కామేశ్వర్ ఆలయంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. సన్యాసిని ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి. గోమతీ నది ఒడ్డున జరిగిన ఈ కార్యక్రమానికి షియా, సున్నీ వర్గాలకు చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై విందు ఆరగించారు. ఇఫ్తార్ కోసం మందిరానికి చెందిన ముగ్గురు వంటవాళ్లు, వారి సహాయకులు ఉదయం నుంచే అన్ని ఏర్పాట్లు చేశారు.
Uttar Pradesh
Lucknow
Mankameshwar
Iftar

More Telugu News