Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు

  • హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్‌, కాటేదాన్‌లో వర్షం
  • వరంగల్‌, హన్మకొండ, ఖాజీపేట ప్రాంతాల్లో కూడా 
  • కమ్ముకున్న మేఘాలు
జూన్‌ నెల మొదటి వారంలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో కురుస్తోన్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని పహాడి షరీఫ్‌, కాటేదాన్‌ పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలతో పాటు హన్మకొండ, ఖాజీపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.               
Telangana
rain
Warangal Rural District
Warangal Urban District

More Telugu News