Karnataka: కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరు కాదు: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్, చంద్రబాబు సహకరించారు
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీని అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారు
  • కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తూ టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, ఆ రెండూ ఒకటేనంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో బీజేపీ యువమోర్చా కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న లక్ష్మణ్ ప్రసంగిస్తూ, కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్, చంద్రబాబు సహకరించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అణగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. కేంద్ర పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 
Karnataka
bjp
laxman

More Telugu News