Narendra Modi: 'మోదీ హత్యకు ఆరెస్సెస్‌/గడ్కరీ కుట్ర' దుమారం రేపుతోన్న విద్యార్థిని వ్యాఖ్యలు

  • మావోయిస్టులు కుట్ర పన్నారని నిన్న పోలీసుల ప్రకటన
  • ఆరెస్సెస్‌/గడ్కరీపై విద్యార్థిని ఆరోపణలు 
  • ఆ నిందను ముస్లింలు, కమ్యూనిస్టులపై వేస్తారని ట్వీట్‌
  • ఆ తరువాత ముస్లింలను ఊచకోత కోస్తారేమోనని వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిగిందని, మావోయిస్టులు ప్రణాళికలు రచించారని మహారాష్ట్రలోని పూణే పోలీసులు చేసిన ప్రకటనపై పలు పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్న నేపథ్యంలో ప్రజల సానుభూతి పొందాలనే మోదీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు అంటున్నారు. అయితే, ఈ విషయంపై ఓ విద్యార్థి నేత చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి.
 
మోదీని హత్య చేసేందుకు ఆరెస్సెస్‌/గడ్కరీ ప్లాన్‌ వేస్తున్నారని అనిపిస్తోందని, ఎందుకంటే ఆ నిందను ముస్లింలు, కమ్యూనిస్టులపై వేసి, ముస్లింలను ఊచకోత కోస్తారేమో అని షెహ్లా రషీద్‌ అనే జేఎన్‌యూ విద్యార్థి నాయకురాలు ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గుర్తించారు. ఆమె చేసిన ఈ సామాజిక వ్యతిరేక వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నానని ట్వీట్‌ చేశారు.
Narendra Modi
Twitter
nitin gadkari

More Telugu News