Andhra Prades: విభజన హామీలను కేంద్రం ఏ మేరకు నెరవేర్చిందో చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

  • ఎనభై ఐదు శాతం విభజన హామీలు నెరవేర్చామనడం తగదు
  • బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీపై నిరంకుశంగా వ్యవహరిస్తోంది
విభజన హామీలను కేంద్రం ఏ మేరకు నెరవేర్చిందో చెప్పాలని బీజేపీ నాయకులకు సీపీఐ రామకృష్ణ సవాల్ విసిరారు. విజయవాడలో ప్రత్యేక హోదా ఉద్యమ సాధన సమితి ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, ఎనభై ఐదు శాతం విభజన హామీలను నెరవేర్చామని బీజేపీ నేతలు చెబుతుండటం సబబు కాదని అన్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో ఈ తప్పుడు ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారని మండిపడ్దారు.

‘బీజేపీ నాయకులను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. విభజన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలి. విభజన హామీల్లో స్పష్టంగా పొందుపరిచిన ఏ అంశాన్ని కూడా సమగ్రంగా నెరవేర్చ లేదు. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎందుకంటే, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ తో పాటు మన రాష్ట్రం కోరిన నిధులు కూడా కేంద్రం ఇవ్వలేదు. రూ.350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కేంద్రం వెనక్కి తీసుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీపై నిరంకుశంగా వ్యవహరిస్తోంది’ అని మండిపడ్డారు.
Andhra Prades
cpi

More Telugu News