saidaiah: నరసరావుపేట మాజీ ఎంపీ సైదయ్య మృతి

  • 1996లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన సైదయ్య
  • అనారోగ్యంతో కన్నుమూత
  • మాచర్లలోని స్వగృహంలో ఆయన భౌతికకాయం
గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ, టీడీపీ నేత కోట సైదయ్య (86) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన టీడీపీ తరపున 1996లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి కాసు వెంకట కృష్ణారెడ్డిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భౌతికకాయాన్ని గుంటూరు జిల్లా మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. ఆయన స్వస్థలం దుర్గి మండలంలోని ఓబులేశునిపల్లి.
saidaiah
narasarao peta
Guntur District

More Telugu News