Srikakulam District: శ్రీకాకుళంలో ఎలుగుబంటి దాడి: మహిళ మృతి

  • సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో చొరబడ్డ ఎలుగుబంటి
  • ఈ దాడిలో ఏడుగురికి గాయాలు
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మహిళ మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలోకి ఈరోజు ఉదయం ప్రవేశించిన ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామస్తులపై దాడి చేసింది. క్షతగాత్రులను పలాస ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఊర్మిళ (40) మృతి చెందింది. ఆమె భర్త తిరుపతిరావు సహా మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మెరుగైన చికిత్సం నిమిత్తం ఈ ముగ్గురిని విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. కాగా, దాడికి పాల్పడిన ఎలుగుబంటిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. ఎలుగుబంటి దాడి ఘటనపై ఎర్రముక్కాలం గ్రామస్తులు మాట్లాడుతూ, ఈ విషయమై అటవీశాఖ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించ లేదని ఆరోపించారు. ఎర్రముక్కాల గ్రామానికి సమీప గ్రామం చిరిమామిడిలో కూడా ఎలుగు బంటి సంచరించిందని, ఒక వ్యక్తిని గాయపరిచినట్టు సమాచారం.
Srikakulam District
bear

More Telugu News