Tollywood: ఈ విషయంలో మా అబ్బాయిని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం: జూనియర్ ఎన్టీఆర్

  • గ్లాసుతో పాలు తాగుతూ కూర్చున్న ఎన్టీఆర్ తనయుడు అభయ్
  • పాలు తాగడం పూర్తయ్యే వరకూ వదిలే ప్రసక్తే లేదంటూ నిలబడ్డ అభయ్ తల్లి
  • ఓ ఫొటో పోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తాజాగా, తమ చిన్నారి అభయ్ రామ్, భార్య ప్రణతి కలిసి ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో చేతిలో గ్లాస్ తో పాలు తాగుతూ..వాళ్ల అమ్మను అభయ్ తదేకంగా చూస్తూ కూర్చుని ఉండగా, పాలు తాగడం పూర్తయ్యే వరకు వెళ్లేందుకు వీల్లేదన్నట్టు అభయ్ తల్లి అతని దగ్గర నిలబడి ఉండటం గమనార్హం.

‘అభయ్ రోజూ తాగాల్సిన పాల కోటా విషయంలో వాడిని వాళ్ల అమ్మ నుంచి ఏమాత్రం కాపాడలేం’ అని ఆ ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ట్వీట్ చేశాడు. కాగా, ఈ ట్వీట్ పై స్పందించిన ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. ‘క్యూట్ నెస్‌ ఓవర్ లోడెడ్’ అంటూ చిన్నారి అభయ్ కి కితాబిచ్చాడు. 
Tollywood
junior ntr

More Telugu News