Jagan: రాజమండ్రి గోదావరి బ్రిడ్జిపై జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ

  • గోదావరి వంతెన బలహీనంగా ఉంది
  • ఎక్కువ మంది రావడం మంచిది కాదు
  • ఓ లేఖ రాసిన రాజమండ్రి డీఎస్పీ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి బ్రిడ్జిపై వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర కు అనుమతి లభించలేదు. పాదయాత్రకు మరో మార్గం చూసుకోవాలని సూచిస్తూ వైసీపీ ప్రతినిధులకు రాజమండ్రి డీఎస్పీ ఓ లేఖ రాశారు. గోదావరి వంతెన బలహీనంగా ఉందని, ఎక్కువ మంది రావడం మంచిది కాదని సూచించారు.

 వంతెన పరిస్థితి సరిగా లేనందునే పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, జగన్ ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. నిడదవోలులో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
Jagan
YSRCP

More Telugu News