Pawan Kalyan: నాపై ఆరోపణలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి: పంచకర్ల రమేష్ బాబు

  • నాపై ఆరోపణలను పదిహేను రోజుల్లో రుజువు చేయాలి
  • లేనిపక్షంలో పవన్ పై పరువునష్టం దావా వేస్తా
  • పవన్ కల్యాణ్ లాగే నాకు కూడా కొంచెం తిక్కుంది
పవన్ కల్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై చేసిన ఆరోపణలకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదిహేను రోజుల్లో రుజువు చేయాలని, లేనిపక్షంలో పవన్ పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అయినప్పటికీ, లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. పవన్ కల్యాణ్ లాగే తనకు కూడా కొంచెం తిక్కుందని, దానికో లెక్కుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ తనకు క్షమాపణ చెప్పకపోతే ఆ లెక్కేంటో చెబుతానని మండిపడ్డారు.
Pawan Kalyan
panchakarla ramesh

More Telugu News