Jagan: టీడీపీపై విమర్శలు చేయడమే జగన్ పని: మంత్రి దేవినేని
- రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారు
- అమరావతిలో ఏ శుభకార్యం జరిగినా జగన్ హాజరుకారు
- సాగునీటి రంగంపై ఆయనకు పూర్తిగా అవగాహనలేదు
టీడీపీపై విమర్శలు చేయడమే వైసీపీ అధినేత జగన్ పనిగా పెట్టుకున్నారని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అమరావతిని భ్రమరావతి’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్న జగన్, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఈ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిలో ఏ శుభకార్యం జరిగినా హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు జగన్ అని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతుంటే విషం జిమ్ముతున్నారని, వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిరంతరాయంగా జరుగుతున్నప్పటికీ జగన్ విమర్శలు చేస్తున్నారని, సాగునీటి రంగంపై ఆయనకు పూర్తిగా అవగాహనలేదని, ఈ రంగంపై జగన్ కు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.