Pawan Kalyan: ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా పవన్ నేర్చుకోవాలి కదా!: నటుడు కోట శ్రీనివాసరావు

  • వాళ్ల అన్నకు ఏం జరిగిందో పవన్ అర్థం చేసుకోవాలిగా
  • నేనే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేశా.. పిచ్చోడినై వచ్చానా? 
  • సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన దైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా ఆయన నేర్చుకోవాలి కదా, వాళ్ల అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలిగా అని అన్నారు.

‘మనకెందుకు చెప్పండి.. నేనే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేశా. పిచ్చోడినై వచ్చానా? సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు’ అన్నారు కోట. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఆయన ప్రస్తావించారు. 'రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీ లాంటి పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు, కుర్రాడు అయిన పవన్ అర్థం చేసుకోవాలిగా?' అని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan
kota srinivasa rao

More Telugu News