amaravathi: అమరావతిలో స్టార్ హోటళ్లకు భూముల కేటాయింపు!

షార్ట్స్‌లో చూడండి
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో స్టార్ హోటళ్లకు భూములు కేటాయించారు. ఫైవ్ స్టార్ హోటల్ కు నాలుగు ఎకరాలు, ఫోర్ స్టార్ హోటల్ కు రెండెకరాల చొప్పున భూమిని కేటాయించడం జరిగింది. ఎకరం కోటిన్నర రూపాయల చొప్పున సీఆర్డీఏ భూములను ఆయా స్టార్ హోటళ్లకు ప్రభుత్వం కేటాయించింది.

 లింగాయపాలెంలో నోవాటెల్, మందడంలో హిల్టన్ గ్రూప్ నకు చెందిన డబుల్ ట్రీ, శాఖమూరులో క్రౌన్ ప్లాజా, నవులూరులో హిల్టన్ ఫైవ్ స్టార్ హోటళ్లకు భూములను కేటాయించింది. కాగా, శాఖమూరులో దసపల్లా, మందడంలో జీఆర్టీ, నవులూరులో గ్రీన్ పార్క్, కొండమరాజుపాలెంలో హాలిడే ఇన్ ఫోర్ స్టార్ హోటల్స్ కు అనుమతులు లభించాయి. రెండు, మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Go Back to Shorts
amaravathi
star hotels

More Telugu News