Chandrababu: అందుకే మోదీ పేరు ఎత్తాలంటేనే జగన్‌కు వెన్నులో వణుకు పుడుతోంది: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకి వెళ్లారని, దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఎత్తాలంటేనే జైలుకి వెళతానని వైసీపీ అధినేత జగన్‌ వెన్నులో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష చివరి రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొని మహా సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఎంపీల రాజీనామా పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని,  2015 నుంచి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారని అన్నారు. వైసీపీతో కేంద్ర ప్రభుత్వం చేతులు కలుపుతోందని, కుట్రదారులతో పాటు పాత్రదారులను ఎన్నికల్లో ఓడించాలని అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై యూటర్న్‌ తీసుకొని ఎన్నో ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు.               
Go Back to Shorts
Chandrababu
Narendra Modi
Jagan

More Telugu News