Chandrababu: అందుకే చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు: పవన్‌ కల్యాణ్‌

  • జనసేన పార్టీలోకి యువత అధికంగా వస్తోంది 
  • దీంతో చంద్రబాబు ఇలాంటి ప్రకటన చేశారు
  • ఆ నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదట
  • డిగ్రీలు చదువుకుని ఉండాలట
డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లు పూర్తి చేసిన వారు కూడా చాలా మంది చెడుదారి పడుతూ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారని, అందుకు కారణం ఉద్యోగాలు కల్పించని ప్రభుత్వాలదేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలోని యలమంచిలిలో నిర్వహించిన ప్రజా పోరాట యాత్రలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నిరుద్యోగ భృతి అమలు చేస్తామంటున్నారని, జనసేన పార్టీలోకి యువత అధికంగా వస్తున్నందునే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు.

ఆ నిరుద్యోగ భృతి కూడా అందరికీ కాదని, డిగ్రీలు చదువుకుని ఉండాలంటున్నారని, మరెన్నో నిబంధనలు పెట్టారని అన్నారు. కాగా, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికే తాను సినిమాలు విడిచిపెట్టానని అన్నారు. జన్మభూమి కమిటీలు ప్రజల్ని మభ్యపెడుతూ దోపిడీ చేసే కమిటీలుగా ఉన్నాయని అన్నారు. బీజీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు రావాలంటే తెలుగు దేశం పార్టీ జెండాలు పట్టుకోవాలని నీచంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇటువంటి పనులు చేసే తెలంగాణలో టీడీపీని లేకుండా చేశారని విమర్శించారు. 
Chandrababu
Jana Sena
Pawan Kalyan

More Telugu News