Chandrababu: లైవ్‌లో చంద్రబాబుని చూస్తూ... ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల మహాసంకల్ప ప్రతిజ్ఞ

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రాభివృద్ధికి త్రికరణ శుద్ధితో కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు ఈరోజు మహాసంకల్పం చేశారు. అమరావతిలోని ఏపీ సచివాలయం ఒకటో బ్లాక్ గ్రీవెన్స్ హాల్ లో ఇన్‌ఛార్జీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా సమక్షంలో ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారు. నవనిర్మాణ దీక్ష చివరి రోజులో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు మహాసంకల్పం చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వస్తోన్న చంద్రబాబు మహాసంకల్పాన్ని అనుకరిస్తూ రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి తామూ అండగా ఉంటామంటూ సచివాలయ ఉద్యోగులు కూడా ప్రతిన బూనారు.
Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
amaravati

More Telugu News