manish tiwari: సమాధానం చెప్పాల్సిందే.. ప్రణబ్ ముఖర్జీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్ తివారీ విమర్శలు

  • నిన్న ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌
  • జాతీయవాదంపై ఎందుకు ప్రసంగం ఇచ్చారని ప్రశ్న
  • లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తోందని వ్యాఖ్య
నిన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్‌ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొని మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ మండిపడ్డారు. ప్రణబ్‌ ఆ సమావేశానికి వెళ్లి జాతీయవాదంపై ఎందుకు ప్రసంగం ఇచ్చారని ప్రశ్నించారు.

తాము అడుగుతోన్న ఈ ప్రశ్నకు ఆయన ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని, ఇది లక్షలాది లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తోన్న విషయమని అన్నారు. గతంలో ఆరెస్సెస్‌ని విమర్శించిన ప్రణబ్‌కు ఇప్పుడు అది ధర్మసంస్థలా కనపడుతోందా? అని ప్రశ్నించారు. కాగా, నిన్న ప్రణబ్‌ చక్కగా మాట్లాడారని కొందరు కాంగ్రెస్‌ నేతలు కితాబునిస్తోన్న విషయం తెలిసిందే.
manish tiwari
Pranab Mukherjee
Congress

More Telugu News