Congress: తెలంగాణ వస్తే తమ జీవితాలు మారుతాయని ప్రజలు భావించారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • కేసీఆర్‌ అణచివేత ధోరణితో పాలన కొనసాగిస్తున్నారు
  • ప్రజల ఆశలను కేసీఆర్‌ వమ్ము చేశారు
  • మా ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాల రద్దు అప్రజాస్వామికం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణచివేత ధోరణితో పాలన కొనసాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈరోజు తమ నేతలతో రాష్ట్ర పరిణామాలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే తమ జీవితాలు మారుతాయని ప్రజలు భావించారని, ప్రజల ఆశలను కేసీఆర్‌ వమ్ము చేశారని అన్నారు.

తమ ఇద్దరు ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వాల రద్దుపై కూడా కేసీఆర్‌ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలి ఛైర్మన్‌కు గాయమైందని తప్పుడు ఆరోపణలు చేశారని, చివరకు హైకోర్టు తప్పుబడుతూ చెంపపెట్టులా తీర్పు ఇచ్చిందని చెప్పారు. కోర్టు తీర్పును ప్రభుత్వం, స్పీకర్‌ పట్టించుకోవట్లేదని, కోర్టు ధిక్కరణ కింద మళ్లీ న్యాయస్థానానికి వెళతామని అన్నారు.         
Congress
Uttam Kumar Reddy
KCR

More Telugu News