Yanamala: ప్రతిపక్షాల విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి: యనమల రామకృష్ణుడు

  • ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సమర్థవంతంగా పాలన
  • ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధి కనపడట్లేదు
  • వాటిని చూడలేని దుస్థితిలో ఉన్నాయి
బడ్జెట్‌ కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తమ నాలుగేళ్ల పాలనపై అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్థిక లోటు ఉన్నప్పటికీ తాము సమర్థవంతంగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. తమ నాలుగేళ్ల పాలనపై మీడియాతో మాట్లాడిన యనమల రామకృష్ణుడు... ప్రజలకు కనపడుతోన్న అభివృద్ధి ప్రతిపక్ష పార్టీలకు కనపడట్లేదని, వాటిని చూడలేని దుస్థితిలో ఉన్నాయని విమర్శించారు.

ఆయా పార్టీల నేతలు చేస్తోన్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని యనమల వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో తాము రూ.5,20,237 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.12,879 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు.     
Yanamala
Andhra Pradesh
YSRCP

More Telugu News