YSRCP: ఇంకా ఆమోదం పొందని వైసీపీ ఎంపీల రాజీనామాలు.. విమానాశ్రయానికి బయల్దేరిన స్పీకర్ సుమిత్రా

  • వైసీపీ ఎంపీల రాజీనామాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • విదేశీ పర్యటన కోసం విమానాశ్రయానికి బయల్దేరిన స్పీకర్
  • స్పీకర్ కార్యాలయం నుంచి ఇంతవరకు వెలువడని సమాచారం
వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించే ప్రక్రియలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతవరకు రాజీనామాలు ఆమోదం పొందలేదు. రాజీనామా లేఖల ఫైల్ ఇంకా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పరిశీలనలోనే ఉంది. మరోవైపు, మధ్యాహ్నం 2 గంటలకు ఆమె విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు. 10 రోజుల పాటు బెలారస్, లాత్వియాలలో ఆమె పర్యటించనున్నారు.

ఇప్పటికే తన నివాసం నుంచి విమానాశ్రయానికి ఆమె బయల్దేరారు. మళ్లీ 19వ తేదీన ఆమె తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో, రాజీనామాలపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ కార్యాలయం నుంచి ఇంత వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. మరోవైపు విమానాశ్రయంలో కొంత సమయం ఉంటుంది కాబట్టి... అక్కడ సంతకాలు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.
YSRCP
mp
resignation
sumitra mahajan

More Telugu News